‘మయసభ’తో మాయ చేయబోతున్న దేవాకట్టా
ఆంధ్ర రాజకీయ చరిత్రలో లెజెండ్స్‌గా నిలిచిన చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితాల ఆధారంగా ‘మయసభ’ సిరీస్ రూపొందింది.;
ప్రభోదాత్మక చిత్రాలతో తన వాయిస్ ను వినిపించే దర్శకుడు దేవ కట్టా తిరిగి డైరెక్షన్ మోడ్ లోకి వచ్చేశాడు. ఈ సారి దేవా.. డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతడి కొత్త ప్రాజెక్ట్ ఓటీటీ సిరీస్ ‘మయసభ’. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఆది పినిశెట్టి, చైతన్య రావు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సిరీస్ టీజర్ రిలీజ్ అయ్యి, సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇంతకీ ‘మయసభ’ స్టోరీ ఏంటని గెస్ చేయాల్సిన పనిలేదు. ఆంధ్ర రాజకీయ చరిత్రలో లెజెండ్స్‌గా నిలిచిన చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితాల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది.
స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే.. ఒకప్పుడు సూపర్ క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్న ఈ ఇద్దరూ, రాజకీయాల్లో ఎలా ఒకరికొకరు పోటీదారులయ్యారు? ఎలా తమదైన మార్క్‌ని ఏపీ పాలిటిక్స్‌లో చూపించారు అన్నది ఈ సిరీస్ హైలైట్. రాజకీయ డ్రామా, ఫ్రెండ్‌షిప్, బిట్రేయల్, పవర్ గేమ్.. ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక రియల్ థ్రిల్లర్ అనుభవాన్ని ఇవ్వబోతోంది. టీజర్‌లో ఆది పినిశెట్టి లుక్ టోటల్ రాయల్ వైబ్‌తో ఉంది. పవర్‌ఫుల్ పాత్రలో ఆది అదరగొట్టేశాడు. టోటల్ డామినేషన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు.
చైతన్య రావు కూడా తన స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఏ మాత్రం తగ్గకుండా ఇంప్రెస్ చేశాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, టెన్షన్, డ్రామా టీజర్‌లోనే అదిరిపోయింది. దేవ కట్టా మార్క్ డైరెక్షన్ స్టైల్, సినిమాటిక్ విజువల్స్, గ్రిప్పింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ ‘మయసభ’ ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తున్నాయి. ఈ సిరీస్ ఆగస్టు 7, 2025న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. టీజర్ చూస్తేనే ఒళ్లు గగుర్పొడిచే రాజకీయ డ్రామా, ఎమోషనల్ రోలర్‌కోస్టర్‌తో పాటు ఇంటెన్స్ మూమెంట్స్‌తో ‘మయసభ’ ఖచ్చితంగా ఆడియన్స్ ను అలరిస్తుందని ఆశిద్దాం.