ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘రెయిడ్ 2’
‘రెయిడ్ 2’ థియేట్రికల్ రిలీజ్ తర్వాత 8 వారాల గ్యాప్‌తో.. జూన్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ స్పేస్‌లో ఈ మూవీ ఎలాంటి సందడి చేస్తుంది, అభిమానులను ఆకట్టుకోగలదా అనేది సినీ లవర్స్‌లో ఆసక్తి రేపుతోంది.;
సూపర్‌హిట్ బ్లాక్‌బస్టర్ ‘రెయిడ్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘రెయిడ్ 2’ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అజయ్ దేవ్‌గణ్, రితేష్ దేశ్‌ముఖ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్.. మొదటి భాగం సృష్టించిన హైప్‌ను అందుకోలేకపోవడంతో అభిమానులను నిరాశ పరిచింది. అయినప్పటికీ, ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త జోష్‌తో రాణించడానికి సిద్ధమవుతోంది.
‘రెయిడ్ 2’ థియేట్రికల్ రిలీజ్ తర్వాత 8 వారాల గ్యాప్‌తో.. జూన్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ స్పేస్‌లో ఈ మూవీ ఎలాంటి సందడి చేస్తుంది, అభిమానులను ఆకట్టుకోగలదా అనేది సినీ లవర్స్‌లో ఆసక్తి రేపుతోంది. థియేటర్‌లో ఆశించిన స్పీడ్ క్యాచ్ చేయలేకపోయిన ఈ సినిమా, డిజిటల్ రిలీజ్‌తో కొత్త ఊపు తెచ్చుకుంటుందని మేకర్స్ ఆశిస్తున్నారు.
రాజ్ కుమార్ గుప్తా డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీ-సీరీస్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అమిత్ త్రివేదీ అందించిన మ్యూజిక్ సినిమాకు సెపరేట్ హైలైట్‌గా నిలిచింది. అదనంగా, తమన్నా భాటియా , జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక స్పెషల్ సాంగ్‌లో సందడి చేశారు. ఇది సినిమాకు గ్లామర్ టచ్ జోడించింది. ‘రెయిడ్ 2’ ఓటీటీ రిలీజ్‌తో రెండో ఇన్నింగ్స్‌లో ఎలాంటి గోల్ కొడుతుందో చూడాలి.