ఓటీటి లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న నయన తార చిత్రం

Update: 2025-03-06 08:53 GMT

ఓటీటి లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న నయన తార చిత్రంనయనతార, మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'టెస్ట్'. ఈ మూవీ థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్ చిత్రం క్రికెట్ నేపథ్యంతో రూపొందించబడింది. 2024 జనవరిలో షూటింగ్ పూర్తి అయినప్పటికీ, విడుదలలో ఆలస్యమైంది. ఈ చిత్రం ఏప్రిల్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆఫీషియల్ ప్రకటించారు మేకర్స్.



'టెస్ట్' కథ చెన్నైలో జరుగుతున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ సమయంలో ముగ్గురు వ్యక్తుల జీవితాల్లో జరిగిన అనూహ్య పరిణామాలను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. దర్శకుడు ఎస్ శశికాంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథను సుమన్ కుమార్ అందించారు, ఆయన గతంలో కీర్తి సురేష్ నటించిన 'రఘు తాత' చిత్రానికి దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం నయనతార తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏడు సినిమాల్లో నటిస్తున్నారు. కన్నడ చిత్రమైన 'టాక్సిక్'లో యష్ సరసన నటించనున్నారు. మాధవన్ ఇటీవల ఓటీటీ ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. 'టెస్ట్' చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలవడం ప్రేక్షకులకు సులభంగా అందుబాటులో ఉండే అవకాశం కల్పిస్తుంది. క్రికెట్ ప్రేమికులు, థ్రిల్లర్ కథలను ఇష్టపడేవారికి ఈ చిత్రం ఆకట్టుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News