ఓటీటీలోకి బాలీవుడ్ మూవీ ‘లవ్యాపా’
"లవ్యాపా" ఏప్రిల్ 4, 2025న ఓటీటీలో విడుదలయ్యే అవకాశముంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ఇప్పటికే జియోహాట్‌స్టార్‌కి ఉన్నట్లు పోస్టర్ల ద్వారా వెల్లడైంది.;
వేలంటైన్స్ వీక్ సందర్భంగా.. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన రొమాంటిక్ కామెడీ మూవీ "లవ్యాపా". ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి రానుంది. ఈ సినిమా ద్వారా జునైద్ ఖాన్, ఖుషీ కపూర్ లు వెండితెరపై అడుగుపెట్టారు. ఇటీవల ఓటీటీ ప్లే లో వచ్చిన సమాచారం ప్రకారం.. "లవ్యాపా" ఏప్రిల్ 4, 2025న ఓటీటీలో విడుదలయ్యే అవకాశముంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ఇప్పటికే జియోహాట్‌స్టార్‌కి ఉన్నట్లు పోస్టర్ల ద్వారా వెల్లడైంది. థియేటర్లలో చూడని బాలీవుడ్ ప్రేక్షకులు లేదా మళ్లీ చూసేందుకు ఆసక్తి ఉన్నారు.
అయితే, అధికారికంగా చిత్రబృందం ఇంకా ఓటీటీ విడుదల తేదీపై ప్రకటించాల్సి ఉంది. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘లవ్ టుడే’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్టైంది.
ఈ జెన్‌జడ్ ప్రేమకథలో.. జునైద్ ఖాన్ (గౌరవ్), ఖుషీ కపూర్ (బానీ) పాత్రలు పోషించారు. పెళ్లికి ముందుగా ఒక రోజు పాటు ఇద్దరూ తమ ఫోన్లు మార్చుకోవడం వల్ల సంభవించే సంఘటనలు, వారి సంబంధాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. ఈ సినిమాలో ప్రధాన తారాగణంతో పాటు అశుతోష్ రాణా, గ్రుషా కపూర్, తన్విక పర్లీకర్, కికూ శర్దా, దేవిశీ మాదాన్, ఆదిత్య కుల్‌శ్రేష్ట, నిఖిల్ మెహతా, జాసన్ థామ్, యూనస్ ఖాన్, యుక్తమ్ ఖోస్లా, కుంజ్ ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.