‘అక్క’ గా మహానటి బోల్డ్ లుక్ !
గతంలో అమెజాన్ ఒరిజినల్స్‌లో కనిపించిన ఈ మహానటి.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌లో కూడా అడుగుపెట్టింది. కీర్తి ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘అక్క’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.;
టాలీవుడ్‌లో ‘నేను లోకల్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. పలు సినిమాల్లో నటించినా.. ఆమెకు అసలైన స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది మాత్రం మహానటి సినిమానే. ఆ సినిమా తో కీర్తి ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. దీంతో వరుస అవకాశాలతో తమిళం, హిందీ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను పెళ్లి చేసుకుని మ్యారెడ్ లైఫ్‌లోకి అడుగుపెట్టింది.
ఆమె పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో మిశ్రమ స్పందనను తెచ్చాయి. కొంతమంది ఆనందం వ్యక్తం చేయగా, మరికొందరు తమ ఫేవరెట్ హీరోయిన్ పెళ్లి చేసుకుందని చిన్న నిరాశ వ్యక్తం చేశారు. అయితే, పెళ్లి అయినప్పటికీ కీర్తి ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌ను కొనసాగించి, ఆమె గత చిత్రం ‘బేబీ జాన్’ మూవీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంది.
ఇక ఓటీటీ లో కూడా కీర్తి తన రేంజ్‌ను పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. గతంలో అమెజాన్ ఒరిజినల్స్‌లో కనిపించిన ఈ మహానటి.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌లో కూడా అడుగుపెట్టింది. కీర్తి ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘అక్క’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఒక ఆసక్తికరమైన టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ టీజర్‌లో కీర్తి సురేష్ బోల్డ్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. ‘అక్క’ అనే టైటిల్ రోల్‌లో నటించిన ఆమె సీరియస్ లుక్‌తో ఉత్కంఠ రేపింది. టీజర్‌ను రిలీజ్ చేసినప్పటికీ, స్ట్రీమింగ్ డేట్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్ గోప్యంగా ఉంచింది. కీర్తి సురేష్ కొత్త అవతారంలో ‘అక్క’ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి!