'పుష్ప 3' వస్తుందా? క్లారిటీ ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ 'పుష్ప' ఫ్రాంఛైస్ ఘన విజయాన్ని సాధించింది. ఈ సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలూ 'పుష్ప 1: ది రైజ్, పుష్ప 2: ది రూల్' పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించాయి. 'పుష్ప 2: ది రూల్' ఎండింగ్ లో 'పుష్ప 3: ది ర్యాంపేజ్' గురించి హింట్ ఇచ్చారు మేకర్స్.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ 'పుష్ప' ఫ్రాంఛైస్ ఘన విజయాన్ని సాధించింది. ఈ సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలూ 'పుష్ప 1: ది రైజ్, పుష్ప 2: ది రూల్' పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించాయి. వీటిలో 'పుష్ప 2' అయితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త కలెక్షన్ల రికార్డులు సృష్టించింది. 'పుష్ప 2: ది రూల్' ఎండింగ్ లో 'పుష్ప 3: ది ర్యాంపేజ్' గురించి హింట్ ఇచ్చారు మేకర్స్.
అయితే 'పుష్ప 3' ఉంటుందా? లేదా?.. ఉంటే.. ఎప్పుడు ఉండొచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా వాటిన్నంటికీ క్లారిటీ దొరికేసింది. తాజాగా మైత్రీ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ 'పుష్ప 3' గురించి క్రేజీ అప్డేట్ అందించారు.
ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ, త్రివిక్రమ్ సినిమాలు చేయనున్నారు. ఆ తర్వాత 'పుష్ప 3' ఉంటుందని క్లారిటీ ఇచ్చారు రవి. ఈనేపథ్యంలో 2028లో 'పుష్ప 3'వచ్చే ఛాన్స్ ఉందని రవిశంకర్ వెల్లడించారు. మరోవైపు డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో చేయబోయే సినిమాకి స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నారు.