‘మ్యాడ్ స్క్వేర్’లో భాయ్ ఎవరు?

‘మ్యాడ్’ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన టీమ్.. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’తో మరింత మజా పంచేందుకు రెడీ అయ్యింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.;

By :  S D R
Update: 2025-03-27 11:36 GMT

‘మ్యాడ్’ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన టీమ్.. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’తో మరింత మజా పంచేందుకు రెడీ అయ్యింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘మ్యాడ్‘లో మెయిన్ లీడ్స్ గా నటించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఈ సినిమాలోనూ ప్రధాన పాత్రల్లో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించగా.. సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరించారు.

రేపు థియేటర్లలోకి రాబోతున్న ‘మ్యాడ్ స్క్వేర్‘ కంప్లీట్ ఫన్ ప్యాకేజ్ అని చెబుతోంది టీమ్. కేవలం 2 గంటల 7 నిమిషాల నిడివితోనే వస్తోన్న ఈ మూవీ లడ్డూ గాని పెళ్లితో మొదలవ్వడం అక్కడ లీడ్ యాక్టర్స్ చేసే నవ్వుల సందడి మామూలుగా ఉండదట. ఇక పెళ్లి తర్వాత గోవాలో పార్టీ చేసుకోవడంతో మరో ట్విస్ట్. గోవాల ‘మ్యాడ్‘ గ్యాంగ్ చేసే అల్లరికి థియేటర్లలో నవ్వులే నవ్వులు అంటోంది టీమ్.

‘మ్యాడ్ స్క్వేర్‘లోని నటీనటుల విషయానికొస్తే నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లతో పాటు.. లడ్డు పాత్రలో విష్ణు, స్వాతి రెడ్డిగా స్పెషల్ సాంగ్ లో మోనిక రెబా జాన్, ప్రియాంక జవాల్కర్ వంటి క్యారెక్టర్స్ ఎంతో హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా రఘుబాబు, సత్యం రాజేష్, మురళీధర్ గౌడ్ పంచే కామెడీ సినిమాని మరో లెవెల్ లో నిలబెడుతుందట.

వీటిన్నింటితో పాటు ఇప్పటివరకూ ప్రచారంలో లేని మరో నటుడు కూడా ‘మ్యాడ్ స్క్వేర్‘లో ఉన్నాడట. అతనే సునీల్. ‘మ్యాడ్ స్క్వేర్‘లో భాయ్ క్యారెక్టర్ లో సునీల్ సర్ప్రైజింగ్ ఎంట్రీ అదిరిపోతుందంటున్నారు. ఇప్పటికే భీమ్స్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. మొత్తంగా.. రేపు ఆడియన్స్ ముందుకు రాబోతున్న ‘మ్యాడ్ స్క్వేర్‘ ప్రేక్షకులకు ఎలాంటి నవ్వుల విందు పంచబోతుందో చూడాలి.

Tags:    

Similar News