'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీలో ఎప్పటి నుంచి?

Update: 2025-02-23 07:20 GMT

'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీలో ఎప్పటి నుంచి?సంక్రాంతి టైటిల్ తోనే వచ్చి సంక్రాంతి బరిలో ఘన విజయాన్ని సాధించింది వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి దుమ్ము లేపింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఉన్న కంటెంట్, వెంకటేష్ యాక్టింగ్, అనిల్ రావిపూడి మాస్ ఎంటర్‌టైన్మెంట్ టచ్‌ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు.

'సంక్రాంతికి వస్తున్నాం'తో పాటు విడుదలైన 'గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్' ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పటినుంచి ఓటీటీలో సందడి చేయనుందా? అనే ఆసక్తి మొదలైంది. అయితే డిజిటల్ రిలీజ్ కంటే ముందే ఈ చిత్రాన్ని టెలివిజన్ ప్రీమియర్ గా తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది జీ స్టూడియోస్. మార్చి 1న సాయంత్రం 6 గంటలకు జీ సినిమాస్ లో టెలివిజన్ ప్రీమియర్ గా 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రదర్శితమవ్వనుంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం టెలివిజన్ ప్రీమియర్ సమయానికే జీ5 వేదికగా ఓటీటీలోనూ 'సంక్రాంతికి వస్తున్నాం' స్ట్రీమింగ్ కి సిద్ధమవుతుందట. పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో ఈ సినిమా మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా.. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన విధంగా, డిజిటల్ మాధ్యమాల్లోనూ ఈ సినిమా విజయం సాధిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News