యూత్ ని టార్గెట్ చేసిన ‘వర్జిన్ బాయ్స్‘
యూత్‌ను టార్గెట్ చేసుకుని తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘వర్జిన్ బాయ్స్’. మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ప్రధాన పాత్రల్లో దయానంద్ గడ్డం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.;
యూత్‌ను టార్గెట్ చేసుకుని తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘వర్జిన్ బాయ్స్’. మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ప్రధాన పాత్రల్లో దయానంద్ గడ్డం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజా దారపునేని ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ తో ఈ సినిమా ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతుందని అర్థమయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ లో అడల్ట్ కంటెంట్ డోస్ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. జూలై 11న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ సందర్భంగా నిర్మాత రాజా దారపునేని ప్రకటించిన బంపర్ ఆఫర్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. జూలై 11 నుంచి 13 వరకు సినిమా చూసే ప్రేక్షకుల్లో 11 మందికి ఐఫోన్లు బహుమతిగా అందించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాక, థియేటర్లలో ‘మనీ రెయిన్’ పేరిట డబ్బులు కూడా పంచనున్నట్లు ప్రకటించారు.
సీటు దగ్గరే డబ్బులు ఇవ్వడం లేదా పేపర్లు ఎగిరినట్లు నోట్లను ఎగురవేసేలా ప్లాన్ చేశామని చెప్పారు. ఈ ఆఫర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డబ్బుల కోసం గొడవలు, తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తంగా డబుల్ మీనింగ్ డైలాగులు, బోల్డ్ కంటెంట్, కామెడీ ప్రధానంగా ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందించబడింది.