'ఎల్లమ్మ' గురించి అప్డేట్ ఇచ్చిన వేణు!

'బలగం' సినిమా తర్వాత 'ఎల్లమ్మ' పేరుతో మరో కథను సిద్ధం చేస్తున్నాడు వేణు. ఈ సినిమాని సైతం దిల్ రాజు నిర్మించబోతున్నారు. తొలుత 'ఎల్లమ్మ' కోసం నాని హీరోగా నటిస్తాడనే ప్రచారం జరిగింది.;

By :  S D R
Update: 2025-02-07 00:54 GMT

అంతకుముందు నటుడిగా పరిచయమున్న వేణు 'బలగం'తో దర్శకుడిగా మారాడు. చాలా తక్కువ బడ్జెట్ లో సహజత్వానికి పెద్ద పీట వేస్తూ వేణు తెరకెక్కించిన 'బలగం' అద్భుతమైన విజయాన్ని సాధించింది. జాతీయ, అంతర్జాతీయంగానూ అవార్డుల పంట పండించింది. 'బలగం' సినిమా తర్వాత 'ఎల్లమ్మ' పేరుతో మరో కథను సిద్ధం చేస్తున్నాడు వేణు. ఈ సినిమాని సైతం దిల్ రాజు నిర్మించబోతున్నారు.

తొలుత 'ఎల్లమ్మ' కోసం నాని హీరోగా నటిస్తాడనే ప్రచారం జరిగింది. కానీ అనివార్య కారణాలతో నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు 'ఎల్లమ్మ' కోసం నితిన్ రంగంలోకి దిగాడు. డివోషనల్ టచ్‌తో కూడిన 'ఎల్లమ్మ' సబ్జెక్ట్ కూడా 'బలగం' తరహాలో మంచి బలమైన కథ, కథనాలతో రూపొందనుందట. తాజాగా 'ఎల్లమ్మ' గురించి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.

జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ రెండు ఫోటోలు షేర్ చేసిన వేణు.. 'గెట్టింగ్ రెడీ.. అప్డేట్ సూన్ ఫర్ ఎల్లమ్మ' అంటూ తన సెకండ్ మూవీ గురించి హింట్ ఇచ్చాడు. 'ఎల్లమ్మ' చిత్రంలో నితిన్ కి జోడీగా సాయి పల్లవి నటిస్తుందనే ప్రచారం ఉంది. మరోవైపు నితిన్ నటిస్తున్న 'రాబిన్‌హుడ్' మార్చిలో విడుదలకు ముస్తాబవుతుంది. ఆ తర్వాత దిల్‌రాజు నిర్మాణంలోనే నితిన్ 'తమ్ముడు' చిత్రం కూడా లైన్లో ఉంది.

https://x.com/VenuYeldandi9/status/1887354669707763855

Tags:    

Similar News