వెంకటేష్ – వినాయక్ కాంబో!

టాలీవుడ్‌లో మాస్ సినిమాల ట్రాక్ రికార్డు కలిగిన డైరెక్టర్లలో వివి వినాయక్ పేరు ప్రత్యేకం. యాక్షన్, ఫ్యాక్షన్, కామెడీ వంటి పక్కా కమర్షియల్ సినిమాలు చేయడంలో దిట్ట వినయ్.;

By :  S D R
Update: 2025-08-27 01:22 GMT

టాలీవుడ్‌లో మాస్ సినిమాల ట్రాక్ రికార్డు కలిగిన డైరెక్టర్లలో వివి వినాయక్ పేరు ప్రత్యేకం. యాక్షన్, ఫ్యాక్షన్, కామెడీ వంటి పక్కా కమర్షియల్ సినిమాలు చేయడంలో దిట్ట వినయ్. కొన్నాళ్లుగా విజయాలు లేకపోవడం, అనారోగ్య సమస్యల కారణంగా డైరెక్షన్ కు దూరమైన వినాయక్.. మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నాడట.

విక్టరీ వెంకటేష్‌తో వినాయక్ కొత్త సినిమా ప్లాన్‌లో ఉన్నాడనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. 2006 సంక్రాంతికి విడుదలైన 'లక్ష్మీ' సినిమా వెంకటేష్ – వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్. ఈ సినిమాలో వెంకీ మాస్ ఇమేజ్ కొత్త స్థాయిలో పెరిగింది. ఇప్పుడు దాదాపు 19 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. నిర్మాత నల్లమలుపు బుజ్జి ఈ కాంబోను మళ్లీ సెట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని ప్రచారం.

‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్.. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు మెగా మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు'లోనూ కీలక కేమియోలో మురిపించబోతున్నాడు. త్రివిక్రమ్ సినిమా తర్వాత వినాయక్ డైరెక్షన్ లో వెంకీ నటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News