వినాయక చవితి స్పెషల్స్

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు పలు కొత్త సినిమాల నుంచి కొత్త లుక్స్, సాంగ్స్ వచ్చాయి. ముందుగా మెగా మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు‘ నుంచి పండగను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి పంచెకట్టులో సందడి చేస్తున్న ఫోటో రిలీజ్ చేశారు.;

By :  S D R
Update: 2025-08-27 08:48 GMT

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు పలు కొత్త సినిమాల నుంచి కొత్త లుక్స్, సాంగ్స్ వచ్చాయి. ముందుగా మెగా మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు‘ నుంచి పండగను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి పంచెకట్టులో సందడి చేస్తున్న ఫోటో రిలీజ్ చేశారు. ఆమధ్య కేరళ షెడ్యూల్ సందర్భంగా షూట్ చేసిన విజువల్స్ లోని ఫోటో ఇది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ నుంచి వినాయక చవితి కానుకగా ‘సువ్వి సువ్వి‘ అంటూ సాగే గీతం విడుదలవ్వగా.. ఇప్పటికే ఈ పాట ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది. మరోవైపు మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర‘. ‘ధమాకా‘ వంటి సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న మూవీ ఇది. ఈరోజు వినాయకచవితి కానుకగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఓ పాటకు సంబంధించిన ఈ పోస్టర్ లో రవితేజ, శ్రీలీల మాస్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు.

అల్లరి నరేష్ ‘12 ఎ రైల్వే కాలనీ‘ నుంచి వినాయక చవితి శుభాకాంక్షలతో కొత్త పోస్టర్ వచ్చింది. త్వరలో ఈ సినిమా విడుదలకానుంది. వినాయక చవితి శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్‘ నుంచి కొత్త పోస్టర్ వచ్చింది. కిరణ్ సరసన యుక్తి తరేజా నటిస్తుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 18న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.

ఇక కాస్త గ్యాప్ తర్వాత నాగశౌర్య నుంచి వస్తోన్న మూవీ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్‘. రామ్ దేశిన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ నుంచి ‘మై డియర్ జనతా‘ అంటూ సాగే గీతం విడుదలైంది. హరీస్ జయరాజ్ సంగీతంలో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర ఆలపించాడు.

Tags:    

Similar News