‘ఓజీ‘ నుంచి రొమాంటిక్ మెలోడీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘ఓజీ‘ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్సెస్, ఫైర్ స్టార్మ్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘సువ్వి సువ్వి‘ అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ రిలీజయ్యింది.;
By : S D R
Update: 2025-08-27 05:53 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘ఓజీ‘ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్సెస్, ఫైర్ స్టార్మ్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘సువ్వి సువ్వి‘ అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ రిలీజయ్యింది.
హీరోహీరోయిన్లు పవన్, ప్రియాంక మోహన్ మధ్య చిత్రీకరించిన ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తమన్ అందించిన మెలోడియస్ ట్యూన్ కు కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించగా ఈ పాటను శ్రుతి రంజని ఆలపించారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీలో చక్కటి మాంటేజ్ తో ఈ పాట ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా.. ఈ పాటలో పవర్ స్టార్ లుక్ బాగుంది. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సుజీత్ తెరకెక్కిస్తున్న ‘ఓజీ‘ దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదలకు ముస్తాబవుతుంది.