యువి క్రియేషన్స్ క్రేజీ లైనప్!

తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో యు.వి.క్రియేషన్స్ ఒకటి. ప్రస్తుతం యు.వి. నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి.;

By :  S D R
Update: 2025-03-26 01:16 GMT

తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో యు.వి.క్రియేషన్స్ ఒకటి. ప్రస్తుతం యు.వి. నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. అయితే అదే సమయంలో ఈ చిత్రాలు అనుకున్న సమయానికి పూర్తవ్వడం లేదు. దీంతో వాయిదాల పర్వం తప్పడం లేదు.

యువి క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’. అసలు జనవరి 10న విడుదల కావాల్సిన ఈ సినిమా, అనూహ్యంగా వాయిదా పడింది. మొదట ‘గేమ్ ఛేంజర్’ కోసం త్యాగం చేసినట్టు పేర్కొన్నా, అసలు కారణం మాత్రం చిత్రానికి సంబంధించిన పెండింగ్ వర్క్ అని టాక్. ఇప్పటికీ ఈ సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ ఖరారు కాకపోవడం మెగా అభిమానులను అయోమయంలో పడేస్తోంది. చిరంజీవి బర్త్‌డే స్పెషల్ గా ఈ ఆగస్టులో 'విశ్వంభర' వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తోంది.

యు.వి.క్రియేషన్స్ నిర్మాణంలో అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న ‘ఘాటీ’ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, తాజా సమాచారం ప్రకారం, వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా కొత్త రిలీజ్ డేట్ కోసం అన్వేషిస్తున్నారు. టీజర్ విడుదల అనంతరం సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ ఈ చిత్రం అనుకున్న సమయానికి రాకపోవడమే నిరాశ కలిగించే అంశంగా మారింది.

యువి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న శర్వానంద్ చిత్రం, అఖిల్ చిత్రాల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ సినిమాలు కూడా అనుకున్న సమయానికి పూర్తవ్వడం లేదనేది ఫిల్మ్‌నగర్ టాక్. మరోవైపు ఇటీవల ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి యు.వి. క్రియేషన్స్.. వరుణ్ తేజ్ ఒక చిత్రాన్ని మొదలు పెట్టింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకుంది.

మొత్తంగా.. యు.వి.క్రియేషన్స్ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్‌ ను లైన్లో పెట్టింది. అయితే వీటిని సరైన ప్లానింగ్ తో సమర్థవంతంగా విడుదల చేయగలిగి విజయాలు అందుకుంటే.. ఈ సంస్థ టాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌గా మారే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News