బన్నీ లుక్ పై త్రివిక్రమ్ కసరత్తులు!

ప్రతీ సినిమాకీ తన మేకోవర్ విషయంలో ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తుంటాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు తన బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని మార్చేసుకుంటాడు. 'అల.. వైకుంఠపురములో' స్టైలిష్ గా కనిపించిన బన్నీ.. 'పుష్ప' కోసం పూర్తి రస్టిక్ గా మారిపోయాడు.;

By :  S D R
Update: 2025-02-04 01:04 GMT

ప్రతీ సినిమాకీ తన మేకోవర్ విషయంలో ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తుంటాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు తన బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని మార్చేసుకుంటాడు. 'అల.. వైకుంఠపురములో' స్టైలిష్ గా కనిపించిన బన్నీ.. 'పుష్ప' కోసం పూర్తి రస్టిక్ గా మారిపోయాడు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసే కొత్త సినిమాకోసం మరో కొత్త లుక్ లోకి మారుతున్నాడట.


ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ లుక్‌పై ప్రత్యేక కసరత్తులు జరుగుతున్నాయట. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు తగ్గట్టుగా గెటప్, స్టైల్ మరియు సెట్‌అప్‌పై పూర్తి క్లారిటీ వచ్చిందని టాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో’ వంటి హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు నాల్గవసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. వీరిద్దరి గత చిత్రం 'అల.. వైకుంఠపురములో'కి ఆల్‌టైమ్ మ్యూజికల్ ఆల్బమ్ ఇచ్చిన తమన్ ఈ మూవీకీ మ్యూజిక్ అందించబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా రూపొందుతోంది.

Tags:    

Similar News