పవన్ లాంఛ్ చేసిన ట్రైలర్!
బుల్లితెరపై ఆర్కే నాయుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే సాగర్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ది 100’.లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంఛ్ చేశారు.;
By : S D R
Update: 2025-07-06 01:46 GMT
బుల్లితెరపై ఆర్కే నాయుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే సాగర్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ది 100’.లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంఛ్ చేశారు. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విక్రాంత్ IPS పాత్రలో ఆర్కే సాగర్ లుక్ ఆకట్టుకుంటుంది. మిషా నారంగ్ హీరోయిన్‌గా, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలో నటించారు.
వాస్తవ సంఘటనల ప్రేరణతో ఈ హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాఘవ్ ఓంకార్ శశిధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ సమకూర్చారు. ఈ చిత్రం జూలై 11న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.