'ఉస్తాద్' కోసం ఇంకొక వారం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్‌కు ఈ ప్రాజెక్ట్‌లో ఇంకా కేవలం 7 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అంటే మరో వారం రోజుల్లో ఆయనకు సంబంధించిన షెడ్యూల్ పూర్తవుతుంది.
తాజా సమాచారం ప్రకారం, రేపటి నుంచి ఒక సాంగ్ షూట్ ప్రారంభం కానుంది. ఈ పాటను అద్భుతమైన సెట్స్‌లో, భారీ డ్యాన్స్ మూమెంట్స్‌తో, హై ఎనర్జీ ట్రీట్‌గా తెరకెక్కించడానికి చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ పాట పవన్ కళ్యాణ్ స్టైల్, ఎనర్జీకి సరిపోయేలా ఉంటుందని టాక్. ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో #UstaadBhagatSinghSong హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్స్ మొదలుపెట్టేశారు.
పాట తర్వాత చిత్రబృందం పవన్ కళ్యాణ్ లేని కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అంటే క్లైమాక్స్‌కు ముందు వచ్చే యాక్షన్ బ్లాక్స్, విలన్లకు సంబంధించిన ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్ వంటివి షూట్ చేయనున్నారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది ప్రథమార్థంలో తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో పవన్ కి జోడీగా శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.