ఇండియన్ సినీ హిస్టరీలో టాప్ డీల్‌!

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న చిత్రం SSMB29. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆసక్తి నెలకొంది.;

By :  S D R
Update: 2025-07-06 14:57 GMT

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న చిత్రం SSMB29. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఓ సంచలనమైన విషయం బయటకు వచ్చింది.

సినీ వర్గాల్లో ప్రచారమవుతోన్న సమాచారం ప్రకారం, SSMB29 మూవీ పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌ ఇప్పటివరకు భారతీయ సినిమా చరిత్రలో నమోదైన అత్యంత భారీ నాన్-థియేట్రికల్ డీల్ లో ఒకటిగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది.

ఇంతవరకూ OTTలో అత్యధిక ధర పలికిన సినిమాగా ‘RRR’ కొనసాగుతోంది. ఆ చిత్రం ఓటీటీ హక్కులు (జీ5, నెట్‌ఫ్లిక్స్‌కి కలిపి) సుమారు రూ.325 నుంచి రూ.350 కోట్లు పలికినట్టు సమాచారం. ఇప్పుడు SSMB29 ఆ రికార్డునే బద్దలు కొట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

SSMB29 మూవీని మైథలాజీ ఎలిమెంట్స్ తో అడ్వెంచర్, మిస్టరీ థ్రిల్లర్ గా యూనివర్శల్ అప్పీల్ తో పాన్ వరల్డ్ రేంజులో రెడీ చేస్తున్నాడట జక్కన్న. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండటం.. ఇంటర్నేషనల్ మార్కెట్ కి బాగా కలిసొచ్చే అవకాశం. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ టీమ్ త్వరలో కెన్యా వెళ్లబోతుంది.

Tags:    

Similar News