ప్రభాస్ కి షాకిచ్చిన రణ్‌వీర్

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కాస్త గ్యాప్ తర్వాత ‘ధురంధర్’గా బాక్సాఫీస్ పైకి దూకబోతున్నాడు. ఆదిత్య ధర్ డైరెక్షన్ లో ఈ చిత్రం రూపొందుతుంది.;

By :  S D R
Update: 2025-07-06 15:19 GMT

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కాస్త గ్యాప్ తర్వాత ‘ధురంధర్’గా బాక్సాఫీస్ పైకి దూకబోతున్నాడు. ఆదిత్య ధర్ డైరెక్షన్ లో ఈ చిత్రం రూపొందుతుంది. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆరేళ్లకు ఆదిత్య ధర్ నుంచి రాబోతున్న సినిమా ఇది.

గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక విక్రమ్ నటించిన ‘నాన్న’ సినిమాలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ ఈ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.

ఫస్ట్ లుక్ పేరుతో 'ధురంధర్' నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రణ్‌వీర్ సింగ్ గ్యాంగ్‌స్టర్‌గా ఫెరోషియస్ లుక్ లో అదరగొడుతున్నాడు. సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ ఖన్నా రోల్స్ కూడా బాగున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కు రెడీ అవుతుంది.

అదే రోజు ప్రభాస్ 'ది రాజా సాబ్' కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. దీంతో.. పాన్ ఇండియా లెవెల్ లో 'ది రాజా సాబ్'కి 'ధురంధర్' గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 'ది రాజా సాబ్' హారర్ బ్యాక్‌డ్రాప్ లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తుంటే.. 'ధురంధర్' పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా విడుదలకు ముస్తాబవుతుంది.

Tags:    

Similar News