మెగా మాస్ ట్రీట్ రెడీ!
మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రంగా వస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘ఫన్ అండ్ ఎమోషన్’ మాస్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పటికే మెగా ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేసింది.;
మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రంగా వస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘ఫన్ అండ్ ఎమోషన్’ మాస్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పటికే మెగా ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేసింది.
మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్ గా రిలీజైన టైటిల్ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ లుక్‌లో చిరు ఎంట్రీ ఇచ్చిన విధానం చూసి, ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు. ఇక సినిమాలో చిరు క్యారెక్టర్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వకుండా ఆఫీసర్‌గానా లేక డ్రిల్ మాస్టర్‌గానా? అని సస్పెన్స్ క్రియేట్ చేశారు.
అనిల్ రావిపూడి సినిమాల్లో ఎనర్జీ లెవెల్ వేరే రేంజ్‌లో ఉంటుంది. ఈసారి మెగా ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఓ స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారట. దసరా సందర్భంగా చిరు స్టెప్పులతో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఒక భారీ మాస్ సాంగ్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. భీమ్స్ సిసిరోలియో అందిస్తున్న ట్యూన్స్ మెగా గ్రేస్‌కి సరిగ్గా సరిపోయేలా ఉంటాయని ఇప్పటికే టాక్ ఉంది.
ఇటీవల ఈ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ నెల 19 వరకూ షూటింగ్ జరుగుతుంది. ఇందులో రెండు పాటలు చిత్రీకరించనున్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ పాటలను షూట్ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా 'మన శంకరవరప్రసాద్ గారు' థియేటర్లలోకి రాబోతున్నారు.