తానా వేదికపై సమంత భావోద్వేగం!

స్టార్ హీరోయిన్ సమంత, అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులు చూపించిన ప్రేమను తలచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యింది.;

By :  S D R
Update: 2025-07-06 14:33 GMT

స్టార్ హీరోయిన్ సమంత, అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులు చూపించిన ప్రేమను తలచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యింది. తన మొదటి సినిమా 'ఏ మాయ చేసావే' నుంచి ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు తనను కుటుంబ సభ్యుల్లా ఆదరించారని గుర్తుచేసుకుని, స్టేజ్‌పై కంటతడి పెట్టింది.

'మీ ప్రేమకు ధన్యవాదాలు చెప్పడానికి నాకు 15 ఏళ్లు పట్టింది,' అంటూ శిరస్సు వంచి నమస్కారం చేసిన సమంత, తానా వేదికపై నిలబడి తన కెరీర్ ను గుర్తు చేసుకుంది. ట్రాలాలా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించిన ఆమె, నిర్మాతగా తొలి చిత్రమైన 'శుభం' అమెరికాలో తెలుగువారి నుండి విశేష స్పందన పొందిందని తెలిపింది.

'ఎక్కడికి వెళ్లినా, ఏ పరిశ్రమలో పనిచేసినా – తెలుగు ప్రేక్షకులు నన్ను చూసి గర్వపడతారా? అన్నదే నా మొదటి ఆలోచన,' అని చెప్పిన సమంత.. 'ఓ బేబీ' అమెరికాలో ఘన విజయాన్ని సాధించిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన సమంతను.. యాంకర్ సుమ స్టేజ్‌పై హత్తుకుని ఓదార్చిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Tags:    

Similar News