ఈ వారం చిన్న చిత్రాలదే హవా

బాక్సాఫీస్ వద్ద వారం వారం కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. ఈ వారం చిన్న చిత్రాలదే హవా. సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ‘, ఆర్.కె. సాగర్ ‘ ది 100‘, ‘వర్జిన్ బాయ్స్‘ చిత్రాలు రేపు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి.;

By :  S D R
Update: 2025-07-10 07:36 GMT

బాక్సాఫీస్ వద్ద వారం వారం కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. ఈ వారం చిన్న చిత్రాలదే హవా. సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ‘, ఆర్.కె. సాగర్ ‘ ది 100‘, ‘వర్జిన్ బాయ్స్‘ చిత్రాలు రేపు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి.

కమెయడిన్ గా మొదలై ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు సుహాస్. ఈనెలలో ఓటీటీలో ‘ఉప్పు కప్పు రంబు‘ సినిమాతో పలకరించిన సుహాస్.. రేపు ‘ఓ భామ అయ్యో రామ‘ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో మలయాళ నటి మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటించింది. రామ్ గోదాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హరీష్‌ నల్ల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ‘ఓ భామ అయ్యో రామ‘పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

బుల్లితెరపై ఆర్కే నాయుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే సాగర్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ది 100’. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నాడు సాగర్. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ ను పవన్ కళ్యాణ్ లాంఛ్ చేయడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాలో మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషించారు. రేపు ‘ది 100‘ ఆడియన్స్ ముందుకు వస్తోంది.

రేపు విడుదలవుతోన్న చిత్రాలలో ‘వర్జిన్ బాయ్స్‘ ఒకటి. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ గురు బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాణంలో దయానంద్ గడ్డం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యూత్ ఫుల్ కంటెంట్ తో ‘వర్జిన్ బాయ్స్‘ ఆడియన్స్ ముందుకు వస్తోంది.

Tags:    

Similar News