రవితేజ సరసన యూత్ ఫేవరెట్ బ్యూటీస్!
మాస్ మహారాజా రవితేజ తన మాస్ స్టైల్ కి కాస్త భిన్నమైన కథతో రాబోతున్నాడట. 'మాస్ జాతర' షూటింగ్ పూర్తి కాగానే కిషోర్ తిరుమల డైరెక్షన్ లో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.
రవితేజ-కిషోర్ తిరుమల మూవీకి 'అనార్కలి' అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ మూవీ కోసం ఇద్దరు హీరోయిన్లు ఫైనలైజ్ అయ్యారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది. ఆ పాత్రల కోసం యంగ్ గ్లామరస్ బ్యూటీస్ మమితా బైజు, కయాదు లోహార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
మమిత ‘ప్రేమలు’ సినిమాతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకోగా, కయాదు ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ద్వారా ట్రెండింగ్‌లో నిలిచింది. కిషోర్ తిరుమల చిత్రాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఈ మూవీలో ఈ ఇద్దరు నాయికలకు మంచి ప్రాధాన్యత గల పాత్రలు ఉండబోతున్నాయట. మొత్తంగా.. వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ రూపొందే ఈ మూవీపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్టు తెలుస్తోంది.