మ్యూజిక్ మ్యాజిక్‌కు సిద్ధమైన 'ఎల్లమ్మ'!
By : Surendra Nalamati
Update: 2025-03-04 04:17 GMT
నటుడు వేణు దర్శకుడిగా 'బలగం' తర్వాత 'ఎల్లమ్మ'ను సిద్ధం చేస్తున్నాడు. హీరోగా నితిన్ నటించనుండగా.. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 'బలగం' తరహాలోనే ఈ కథ కూడా బలమైన భావోద్వేగాలతో రూపొందుతుందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటున్న 'ఎల్లమ్మ'లో మ్యూజికల్ పార్ట్ ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
'బలగం' సినిమా విజయంలో పాటలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు 'ఎల్లమ్మ' కోసం అంతకు మించి అన్నట్టుగా సిద్ధమవుతున్నాడు వేణు. అయితే ఈసారి భీమ్స్ ను కాదని సంగీతం కోసం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ డ్యూయోని తీసుకొస్తున్నాడు. హిందీ, మరాఠీలలో పలు విజయవంతమైన సినిమాలకు పనిచేసిన అజయ్-అతుల్ డ్యూయో 'ఎల్లమ్మ'కి సంగీతాన్ని సమకూర్చనున్నారట. మే నెల నుంచి ఈ సినిమా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.