మళ్లీ వార్తల్లోకి చియాన్ విక్రమ్

విక్రమ్ మరో కీలక పాత్ర కోసం మళ్లీ ఈ చిత్రంతో లింక్ అవుతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇందులో నిజానిజాలపై ఇంకా స్పష్టతలేదు. చిత్రబృందం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.;

By :  K R K
Update: 2025-05-15 01:32 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెర కెక్కుతోన్న ‘యస్ యస్ యంబీ 29’ మూవీ షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే, ఈ చిత్రంలో విలన్ పాత్రకు తమిళ స్టార్ ‘చియాన్’ విక్రమ్ ఎంపిక య్యాడన్న వార్తలు హల్చల్ చేశాయి. అంతే కాకుండా, మహేష్ బాబుతో సమానంగా ప్యారలల్ రోల్‌లో కూడా విక్రమ్ కనిపించనున్నాడన్న ఊహాగానాలు వినిపించాయి.

కానీ.. ఇప్పుడు మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అధికారికంగా టీమ్‌లో చేరి షూటింగ్‌లో పాల్గొన్నప్పటి నుంచీ, విక్రమ్ చుట్టూ ఉన్న గాసిప్‌లకు ఫుల్‌స్టాప్ పడినట్టే అనిపించింది. అయితే ఇప్పుడు.. మరోసారి ఆ వార్తలు పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా వచ్చిన తాజా బజ్ ప్రకారం .. విక్రమ్ మరో కీలక పాత్ర కోసం మళ్లీ ఈ చిత్రంతో లింక్ అవుతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇందులో నిజానిజాలపై ఇంకా స్పష్టతలేదు. చిత్రబృందం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఆ మధ్య తంగలాన్ ప్రమోషన్స్ సందర్భంగా విక్రమ్‌ను రాజమౌళితో కలిసి పనిచేసే అవకాశంపై ప్రశ్నించగా.. “రాజమౌళి నాకు మంచి స్నేహితులు. మేమిద్దరం చాలా కాలంగా మాట్లాడుకుంటున్నాం. ఓ సమయంలో కలిసి సినిమా తప్పకుండా చేస్తాం,” అని చెప్పాడు విక్రమ్. ఈ వ్యాఖ్యలతో కూడిన తాజా ప్రచారం మరింత ఊపందుకుంటుండగా… వాస్తవానికి ఇంకా కొంత సమయం పట్టేలా ఉంది. విక్రమ్ ఎంట్రీపై క్లారిటీ రావాలంటే అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News