'వీరమల్లు'కి తెలంగాణలోనూ బంపరాఫర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా 'హరిహర వీరమల్లు' జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.;

By :  S D R
Update: 2025-07-21 16:41 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా 'హరిహర వీరమల్లు' జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

లేటెస్ట్ గా తెలంగాణ ప్రభుత్వం సైతం 'హరిహర వీరమల్లు' టికెట్ ధరలు పెంపుకు, ప్రీమియర్ షో లకు అనుమతులు జారీ చేసింది. జూలై 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు రూ.600 రేటుతో టికెట్లు అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

అదే విధంగా జులై 24 నుంచి 27 వరకూ మల్టీప్లెక్స్‌లలో రూ.200, సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, జులై 28 నుంచి ఆగస్టు 2 వరకూ మల్టీప్లెక్స్‌లలో రూ.150, సింగిల్ స్క్రీన్‌లలో రూ.106 పెంచుకునేందుకు అనుమతులు జారీ చేసింది. అలాగే రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతులు జారీ చేసింది.

Tags:    

Similar News