'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ హైలైట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఒక గొప్ప మానవతావాది అని కొనియాడారు. 'తాను ఎవరి బాటలోనూ కాదని, తనదైన దారిలో నడిచే వ్యక్తి పవన్' అంటూ ప్రశంసలు కురిపించారు. సినిమా, రాజకీయాలు రెండింటిలోనూ పవన్ తన మార్గాన్ని నిర్మించుకున్నాడని చెప్పారు.
నిర్మాత ఏ.ఎం. రత్నం మాట్లాడుతూ, ఈ సినిమా తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైనదని తెలిపారు. ఇది కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఆత్మచింతన రేపే చారిత్రక చిత్రం అని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడం, ఆయన కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషంగా నిలుస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, 'సక్సెస్‌లో అందరూ వెతుక్కుంటూ వస్తారు. కానీ నేను కష్టాల్లో ఉన్నపుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి ‘జల్సా’ తీసిన త్రివిక్రమ్ నా ఆత్మబంధువు' అని భావోద్వేగంగా మాట్లాడారు. తాను రీమేక్ సినిమాలు చేసినదే వేరే దారి లేకేనని అన్నారు.
ఈ ఈవెంట్‌ను శిల్పకళావేదికకు పరిమితం చేయాల్సి వచ్చినా, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీసు అధికారులు అందించిన సహకారానికి పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, కర్ణాటక మంత్రి ఈశ్వర ఖండ్రే, ఆంధ్రప్రదేవ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు.