ఈ మూవీకి వెబ్ సిరీస్ ఆధారమా?

ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ ‘ఓజార్క్’ నుంచి స్ఫూర్తి పొందిందని తెలుస్తోంది. ‘ఓజార్క్’ సిరీస్ ఒక క్రైమ్ డ్రామాగా, డార్క్ కామెడీ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.;

By :  K R K
Update: 2025-08-18 01:40 GMT

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడిగా గుర్తింపు పొందడానికి ముందు రచయితగా తన కెరీర్‌ని అద్భుతంగా మొదలుపెట్టారు. వెంకటేష్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సూపర్ హిట్ సినిమాలతో రచయితగా తనదైన ముద్ర వేశారు. ఈ సినిమాలు కమర్షియల్‌గా విజయవంతం కావడమే కాకుండా, త్రివిక్రమ్ డైలాగ్ రైటింగ్ స్టైల్‌కి ఫ్యాన్ బేస్‌ని కూడా సృష్టించాయి. ఇప్పుడు, దాదాపు 21 ఏళ్ల తర్వాత, త్రివిక్రమ్ మరోసారి వెంకటేష్‌తో జతకట్టారు.

ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. కానీ దీనికి డార్క్ కామెడీ షేడ్స్ జోడించి, బలమైన ఎమోషనల్ డ్రామాతో మలిచారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ ‘ఓజార్క్’ నుంచి స్ఫూర్తి పొందిందని తెలుస్తోంది. ‘ఓజార్క్’ సిరీస్ ఒక క్రైమ్ డ్రామాగా, డార్క్ కామెడీ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్.. ఈ సిరీస్‌లోని కొన్ని కీలక అంశాలను తీసుకుని, తనదైన స్టైల్‌లో ఒక డార్క్ కామెడీ స్క్రిప్ట్‌ని రాశారు. త్రివిక్రమ్ గతంలో ఫ్రీమేక్‌లు చేయడంలో పేరుగాంచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ‘ఓజార్క్’ ఆధారంగా రూపొందిన ఒక ఫ్రీమేక్ అని చెప్పవచ్చు. అయితే, త్రివిక్రమ్ స్టైల్‌లో ఈ కథకు తెలుగు నేటివిటీ, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా జోడించి రాసినట్లు సమాచారం.

ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే ఫైనల్ అయిపోయింది. సెప్టెంబర్ 2025 నుంచి షూటింగ్ మొదలవనుంది. ఈ ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది, వీరు గతంలో త్రివిక్రమ్‌తో హిట్ సినిమాలు అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవల అధికారికంగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఇప్పటికే హై లెవెల్‌లో ఉన్నాయి. త్రివిక్రమ్ స్మార్ట్ రైటింగ్, వెంకటేష్ వర్సటైల్ యాక్టింగ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ యొక్క క్వాలిటీ ప్రొడక్షన్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags:    

Similar News