యన్టీఆర్ ను స్వాగతించిన యూఎస్ కాన్సుల్ జనరల్
ఆయన యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌తో సమావేశమయ్యారు. ఆమె ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాలను తరువాత ట్విట్టర్‌లో పంచుకున్నారు.;
యంగ్ టైగర్ యన్టీఆర్ తాజాగా.. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌ను సందర్శించారు. అక్కడ ఆయన యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌తో సమావేశమయ్యారు. ఆమె ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాలను తరువాత ట్విట్టర్‌లో పంచుకున్నారు.
ఆమె తన ట్వీట్‌లో.. “కాన్సులేట్‌కు యన్టీఆర్ ను స్వాగతించడం చాలా సంతోషంగా ఉంది. యునైటెడ్ స్టేట్స్‌లో చిత్రీకరించాల్సిన ఆయన తాజా చిత్రం, రాబోయే ప్రాజెక్ట్‌లు భాగస్వామ్య శక్తిని, ఉద్యోగ కల్పనను, భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడాన్ని చూపిస్తున్నాయి..” అని పేర్కొన్నారు.
ఆమె చెప్పిన దాని ప్రకారం.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘డ్రాగన్’ చిత్రంలోని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ త్వరలో యూఎస్‌కు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డ్రాగన్ చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పూర్తిగా గడ్డంతో రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు. హీరోయిన్ గురించి చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు రవి బస్రూర్ డ్రాగన్ చిత్రానికి తాను అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల కంటే మరింత అద్భుతంగా ఉంటుందని వెల్లడించారు. ఇటీవల ఎన్టీఆర్ సినిమాలు చూసి తాను ఆయనకు అభిమానిగా మారానని కూడా ఆయన తెలిపారు.