మరో ఇంటర్నేషనల్ యాక్టర్ తో విజయ్ దేవరకొండ
'ది మమ్మీ, ది మమ్మీ రిటర్న్స్' చిత్రాలలో ప్రతినాయకుడి పాత్రలతో ప్రసిద్ధి చెందిన దక్షిణాఫ్రికా నటుడు ఆర్నాల్డ్ వోస్లూ బ్రిటిష్ అధికారి పాత్రలో నటించనున్నాడు.;
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'లైగర్' చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌తో కలిసి నటించి ఒక ప్రత్యేకమైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ, ఒక అంతర్జాతీయ సెలబ్రిటీతో విజయ్ కలిసి నటించడం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
ప్రస్తుతం.. విజయ్ దేవరకొండ మరో అంతర్జాతీయ నటుడితో కలిసి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియడ్ డ్రామాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాయలసీమ నేపథ్యంలో బ్రిటిష్ కాలం నాటి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజా సమాచారం ప్రకారం, 'ది మమ్మీ, ది మమ్మీ రిటర్న్స్' చిత్రాలలో ప్రతినాయకుడి పాత్రలతో ప్రసిద్ధి చెందిన దక్షిణాఫ్రికా నటుడు ఆర్నాల్డ్ వోస్లూ బ్రిటిష్ అధికారి పాత్రలో నటించనున్నాడు. అయితే.. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ అద్భుతమైన కలయిక, పీరియడ్ డ్రామా తెరపై ఎలా ఉండబోతుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.