టాలీవుడ్‌లో టాప్ బడ్జెట్ మూవీ.. ఎన్టీఆర్ ఫిల్మ్ కొత్త రికార్డు?

Update: 2025-03-02 07:02 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘వార్ 2’ షూటింగ్‌ను పూర్తి చేస్తూనే, మరోవైపు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో తన నెక్స్ట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ మొదలైంది.

ప్రస్తుతానికి ఎన్టీఆర్ లేని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి బడ్జెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్-నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ రూ.400 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ పరంగా ఎన్టీఆర్ సినిమాల్లోనే ఇదొక మైలురాయిగా నిలవనుందట.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. హీరోలను ఓ రేంజులో ఎలివేట్ చేయడంలో దిట్ట ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమాలో తారక్ ఎలివేషన్స్ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయట. ఎన్టీఆర్ మునుపెన్నడూ చేయని తరహా మాస్, రా, ఇంటెన్స్ లుక్‌లో ఈ సినిమాలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే యేడాది ప్రథమార్థంలో ఎన్టీఆర్-నీల్ మూవీ థియేటర్లలోకి రానుంది.

Tags:    

Similar News