దేశంలోనే టాలీవుడ్ టాప్.. మోహన్ లాల్!
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేస్తున్నారు.
ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మోహన్‌లాల్, పృథ్వీరాజ్, నిర్మాత దిల్‌రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు పరిశ్రమను దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రీగా కొనియాడిన మోహన్‌లాల్, తన 47 ఏళ్ల సినీ ప్రయాణంలో తెలుగు నటులతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ‘ఎల్2: ఎంపురాన్’ కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డామన్నారు.
ఇక తెలుగు ప్రేక్షకులతో తనకు ఎప్పుడూ ప్రత్యేకమైన అనుబంధముందని, ‘సలార్’ ద్వారా మరింత దగ్గరయ్యానని పృథ్వీరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. ‘లూసిఫర్’ విజయం తర్వాత రెండో భాగం ‘ఎంపురాన్‘ని గ్రాండ్‌గా రూపొందించామని, టికెట్ బుకింగ్స్‌కి వస్తోన్న స్పందన చూసి మూడో భాగాన్ని కూడా నిర్మించాలనుకుంటున్నట్లు పృథ్వీరాజ్ తెలిపారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. డైరెక్టర్ పృథ్వీరాజ్‌ను.. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్‌ల సరసన నిలిపారు దిల్ రాజు.