‘ది ప్యారడైజ్’ మిస్టరీ కొనసాగుతూనే ఉంది?
‘ది ప్యారడైజ్’ మిస్టరీ కొనసాగుతూనే ఉంది?ప్రతి సినిమాతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే హీరోలలో నాని ముందు వరుసలో ఉంటాడు. ‘ది ప్యారడైజ్’లో నాని లుక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టీజర్‌లో నాని ఒంటిమీద విస్తృతమైన పచ్చబొట్లు, రెండు జడలు అతను ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషిస్తున్నాడా? అనే చర్చ కూడా మొదలైంది.
అయితే మూవీ టీమ్ మాత్రం 'ది ప్యారడైజ్'.. హాలీవుడ్ 'మ్యాడ్ మ్యాక్స్' తరహాలో పీరియడ్ స్టోరీతో ఉంటుందంటున్నారు. ఆద్యంతం సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ బ్యాక్‌డ్రాప్ లో ఈ మూవీని తీర్చిదిద్దుతున్నాడట డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. 'దసరా' మూవీ కోసం నానిని ఊర మాస్ గా ప్రెజెంట్ చేసిన శ్రీకాంత్ ఓదెల.. ఈ సినిమాలో నేచురల్ స్టార్ ని సరికొత్తగా ఆవిష్కరించబోతున్నాడు అనేది కన్ఫమ్.
ఇక నిజంగా ఈ సినిమాలో నాని పాత్ర ట్రాన్స్‌జెండర్‌దా? లేక ఇది కథలో ఇంకో వినూత్నమైన కోణమా? అనేది థియేటర్ లోనే చూడాలి. కానీ ఓ విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. 'ది ప్యారడైజ్'తో నాని మరోసారి తన విభిన్నమైన పాత్రల ఎంపికతో సినీప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ప్రయత్నం చేస్తున్నాడు.