చివరిదశలో రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ షూటింగ్!

రష్మికా మందన్న మరో సూపర్ ఎక్సయిటంగ్ మూవీ "ది గర్ల్‌ఫ్రెండ్" తో మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీగా ఉంది. ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ షూటింగ్ షెడ్యూల్‌లో ఉంది.;

By :  K R K
Update: 2025-07-06 00:52 GMT

రష్మికా మందన్నా ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతోంది. పలు పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఆడియన్స్‌ను ఫిదా చేసేసింది. రీసెంట్ గా "కుబేర" సినిమాలో తన డీగ్లామ్ లుక్‌తో అందరి మనసులను కొల్లగొట్టింది. ఇప్పుడు ఆమె మరో సూపర్ ఎక్సయిటంగ్ మూవీ "ది గర్ల్‌ఫ్రెండ్" తో మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీగా ఉంది. ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ షూటింగ్ షెడ్యూల్‌లో ఉంది.

హైదరాబాద్‌లో రష్మిక, హీరో దీక్షిత్ శెట్టిపై ఒక సూపర్ కూల్ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ సాంగ్‌లో ఇద్దరి కెమిస్ట్రీ ఖచ్చితంగా స్క్రీన్‌పై ఫైర్ పుట్టిస్తుందని టాక్. సినిమా టీమ్ త్వరలోనే రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతోంది. అంతేకాదు.. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ నెలలోనే ఒక మాస్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇది ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇవ్వబోతోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న "ది గర్ల్‌ఫ్రెండ్" రష్మిక పాత్ర చుట్టూ తిరిగే ఫీల్-గుడ్ స్టోరీ.

ఈ మూవీలో రష్మికా తన యాక్టింగ్ స్కిల్స్‌తో మరోసారి అదరగొట్టబోతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తున్నాయి. హీరోగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఈ కొత్త జోడీ ఆడియన్స్‌కు ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. ఈ సినిమాతో రష్మికా మరో బిగ్ హిట్ కొట్టబోతోందని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది. మరి గర్ల్ ఫ్రెండ్ గా రష్మికా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. 

Tags:    

Similar News