రబిన్ హుడ్ కి కొత్త గ్లామర్
'అది ద సర్ప్రైజ్'.. కేతికా శర్మ గ్లామర్ ట్రీట్!నితిన్ 'రాబిన్‌హుడ్' నుంచి థర్డ్ సింగిల్ వచ్చేసింది. 'అది ద సర్ప్రైజ్' అంటూ కేతికా శర్మ స్పెషల్ అప్పీరెన్స్ తో ఈ పాట గ్లామరస్ గా ఆకట్టుకుంటుంది. కేతికా శర్మ ఈ ప్రత్యేక గీతంలో ఆకర్షణీయమైన లుక్, ఎనర్జిటిక్ డాన్స్‌తో అదరగొట్టింది.
జివి ప్రకాష్ కుమార్ హై-ఎనర్జీ మాస్ బీట్‌తో సంగీతాన్ని అందించగా చంద్రబోస్ రాసిన ఈ పాటను నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. శేఖర్ మాస్టర్ డాన్స్ మూమెంట్స్ పాట వైబ్‌కి తగ్గట్టుగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ పాట విడుదలైన వెంటనే యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఈ సాంగ్ చివరిలో హీరోహీరోయిన్లు నితిన్, శ్రీలీల స్టెప్పులు కూడా ఎంతో మాసీగా ఆకట్టుకోనున్నట్టు తెలుస్తోంది. మార్చి 28న విడుదల కాబోతున్న 'రాబిన్ హుడ్' పై అంచనాలు పెరుగుతున్నాయి.