గోపీచంద్ మలినేని బాటలో డైరెక్టర్ బాబీ?

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ బాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తుండగా, దానికి బాబీ దర్శకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం.;

By :  K R K
Update: 2025-02-03 01:48 GMT

మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" సినిమాతో భారీ హిట్ సాధించిన బాబీ.. ఈ ఏడాది.. నందమూరి బాలకృష్ణతో "డాకూ మహారాజ్" రూపొందించాడు. రిలీజ్ కు ముందే ఈ సినిమా మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. టేకింగ్, మేకింగ్ లో బాబీ ఎంతో మెచ్యూర్ గా డైరెక్షన్ చేశాడనే అభిప్రాయాలు వచ్చాయి. ఈ చిత్రం ఆయనకు దర్శకుడిగా మరింత పేరు తెచ్చిపెట్టింది.

అయితే "డాకూ మహారాజ్" తర్వాత బాబీ కొత్త సినిమా ఎవరితో? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. చిరంజీవితో మరో సినిమా చేసే అవకాశముందని వార్తలు వచ్చాయి. అయితే చిరు ప్రస్తుతం అనిల్ రావిపూడి కథకు ఓకే చెప్పారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ లోగా బాబీ కొత్త ప్రాజెక్ట్ చేపట్టే అవకాశముందని సమాచారం.

ఈసారి బాబీ బాలీవుడ్‌ బాట పట్టనున్నాడా? అనే వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ బాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తుండగా, దానికి బాబీ దర్శకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. గతంలో గోపీచంద్ మలినేని "వీర సింహా రెడ్డి" తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి ఓ సినిమా ప్రారంభించగా, దానిని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పుడు అదే బాటలో బాబీ కూడా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం బాబీ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడని, త్వరలో ముంబైలో ఓ పెద్ద హీరోను కలవనున్నాడని టాక్. మార్చి లేదా ఏప్రిల్ నాటికి బాబీ కొత్త సినిమా గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కి వెళ్లే మరో టాలెంటెడ్ డైరెక్టర్‌గా బాబీ పేరు మారుమోగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News