కెరీర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన తమన్నా !
కెరీర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన తమన్నా !టాలీవుడ్, బాలీవుడ్ చిత్రసీమలో ఒక హాట్ టాపిక్‌గా మారిన తమన్నా భాటియా, విజయ్ వర్మ బ్రేకప్ వార్తలు ఇప్పుడు అధికారికంగా నిర్ధారణ అయినట్లేనని భావిస్తున్నారు. ‘లస్ట్ స్టోరీస్ 2’ లో కలిసి నటించిన ఈ జంట గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే.. ఇటీవల వీరిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. మీడియాలో, సోషల్ మీడియాలో వీరి బ్రేకప్ పెద్ద ఎత్తున చర్చిస్తున్నా.. వీరిద్దరూ ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. ఇద్దరూ పరస్పరం గౌరవాన్ని కాపాడుకుంటూ, స్నేహాన్ని కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఈ బ్రేకప్ తర్వాత తమన్నా పూర్తిగా తన కెరీర్‌పై దృష్టిపెట్టాలని నిర్ణయించుకుంది. పెళ్లి విషయాలను పక్కనపెట్టి, మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన తెలుగు చిత్రం "ఒడెలా 2" ఈ వేసవి సెలవుల్లో విడుదలకు సిద్ధమవుతోంది. అంతేకాదు, మరిన్ని ఆఫర్ల కోసం ఆమె దర్శక నిర్మాతలను సంప్రదిస్తోందని తెలుస్తోంది.
ఇక స్పెషల్ సాంగ్స్ విషయంలోనూ తమన్నా క్రేజ్ తగ్గలేదు. రజినీకాంత్ "జైలర్" లోని "కావాలయ్యా" పాట, బాలీవుడ్ చిత్రమైన "స్త్రీ 2" లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. అందువల్ల, భవిష్యత్తులో కూడా ఆమెకు స్పెషల్ సాంగ్స్ కోసం భారీ డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి.. ఈ బ్రేకప్ తమన్నా కెరీర్‌పై ఎక్కువ ప్రభావం చూపించకుండా, కొత్త ప్రాజెక్టుల ద్వారా ముందుకు సాగాలని ఆమె భావిస్తోంది. మరి, త్వరలోనే ఆమె నుంచి కొత్త చిత్రాల అధికారిక ప్రకటనలొస్తాయేమో చూడాలి.