తమన్నా సరికొత్త లక్ష్యం ఇదే !

తన లక్ష్యం ఇప్పుడు ఉన్న ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం మాత్రమే కాదని, ఇంకాస్త ముందుకు వెళ్లి, మరింత ఆరోగ్యకరమైన, సన్నబడిన శరీరాకృతిని సాధించడం అని వెల్లడించింది.;

By :  K R K
Update: 2025-09-19 09:05 GMT

విజయ్ వర్మతో దాదాపు రెండు సంవత్సరాల రిలేషన్‌షిప్‌ తర్వాత బ్రేకప్ అయ్యాక, తమన్నా భాటియా తన దృష్టిని పూర్తిగా ఫిట్‌నెస్‌పై పెట్టింది. మళ్లీ ఫిట్‌గా మారాలనే దృఢ సంకల్పంతో తన ట్రైనర్ సిద్ధార్థ సింగ్ పర్యవేక్షణలో జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఆ శ్రమ ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. తమన్నా గణనీయంగా బరువు తగ్గి, గతంలో కంటే మరింత ఫిట్‌గా కనిపిస్తోంది.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ, తన లక్ష్యం ఇప్పుడు ఉన్న ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం మాత్రమే కాదని, ఇంకాస్త ముందుకు వెళ్లి, మరింత ఆరోగ్యకరమైన, సన్నబడిన శరీరాకృతిని సాధించడం అని వెల్లడించింది. గతంలో తరచూ తలెత్తిన ఆరోగ్య సమస్యల వల్ల ఫిట్‌నెస్‌ను కొనసాగించడం కష్టమయ్యేదని ఆమె అంగీకరించింది. అయితే.. తన ట్రైనర్ పోషకాహారం, ఫిట్‌నెస్ ప్రణాళికలో ఉన్న నైపుణ్యం వల్ల దీర్ఘకాలికంగా ఫిట్‌గా ఉండగలనని ఆమె నమ్మకంగా ఉంది.

ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే .. ఆమె ప్రస్తుతం తన ప్రైమ్ వీడియో సిరీస్ ‘డూయూ వన్నా పార్టనర్స్’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. అలాగే, ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ లోనూ నటిస్తోంది. రెండు ఓటీటీ షోలు స్ట్రీమింగ్‌లో ఉండగా, మరో రెండు ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నందున తమన్నా అందరి దృష్టినీ ఆకర్షిస్తూనే ఉంది.

Tags:    

Similar News