గ్లామర్ ఫోటోషూట్స్ తో తమన్నా బిజీ !

బరువు తగ్గడంతో పాటు, ఆమె ఫిజికల్ ఫిట్‌నెస్‌లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపించింది. నటుడు విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత, తమన్నా తన ఫిట్‌నెస్ జర్నీని సీరియస్‌గా తీసుకుని, దాన్ని హృదయపూర్వకంగా ఫాలో అవుతోంది.;

By :  K R K
Update: 2025-07-29 00:47 GMT

మిల్కీ బ్యూటీ తమన్నా తన ఫిట్‌నెస్ ను తిరిగి టాప్ గేర్‌లోకి తెచ్చేందుకు ఫుల్ డెడికేషన్‌తో కష్టపడుతోందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆమె తన జిమ్ సెషన్ నుంచి ఒక స్టన్నింగ్ ఫోటో షేర్ చేసింది. దాన్లో ఆమె లుక్‌లో కనిపించిన ట్రాన్స్‌ఫర్మేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బరువు తగ్గడంతో పాటు, ఆమె ఫిజికల్ ఫిట్‌నెస్‌లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపించింది. నటుడు విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత, తమన్నా తన ఫిట్‌నెస్ జర్నీని సీరియస్‌గా తీసుకుని, దాన్ని హృదయపూర్వకంగా ఫాలో అవుతోంది.

ఇప్పుడు, తన కెరీర్ అండ్ వెల్‌నెస్‌పై ఫోకస్ పెడుతూ.. తమన్నా రీసెంట్ గ్లామరస్ ఫోటోషూట్ నుంచి కొన్ని అదిరిపోయే పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోలు కేవలం ఆమె స్లిమ్ అండ్ టోన్డ్ ఫిజిక్‌ను మాత్రమే కాకుండా.. ఆమెలో కొత్తగా వచ్చిన కాన్ఫిడెన్స్‌ను కూడా సూపర్‌గా హైలైట్ చేస్తున్నాయి. ఆమె బాడీ లాంగ్వేజ్ నుంచి ఆమె స్టైల్ వరకూ ప్రతిదీ ఆమె ఎఫర్ట్‌ను చాటిచెప్పింది. ఈ అద్భుతమైన పిక్స్ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా హోస్ట్ చేసిన గత రాత్రి జరిగిన హై-ప్రొఫైల్ కుటూర్ ఈవెంట్ నుంచి వచ్చాయి.

తమన్నా తన రేడియంట్ లుక్‌తో ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె అట్ట్రాక్టివ్ అప్పీరియన్స్ మరియు స్టైలిష్ వైబ్‌తో స్టేజ్‌ను లైటప్ చేసింది. మనీష్ మల్హోత్రా డిజైన్స్‌లో ఆమె లుక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందని చెప్పాలి. ఈ ఫోటోలను షేర్ చేస్తూ, తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా క్యాప్షన్ రాసింది: ‘‘మనీష్ మల్హోత్రా .. నీ గ్లామ్ అనేది ఒక ఎమోషన్, ఆ కుటూర్ పార్టీ కూడా అంతే వైబ్‌ను ఇచ్చింది. ఏమైనా రాత్రి అదిరిపోయింది.. గ్లామర్ విషయంలో నీ రేంజ్‌కు ఎవరూ సాటిరారు..” అని పెట్టిన ఈ పోస్ట్‌తో తమన్నా తన ఫ్యాషన్ గేమ్‌ను కూడా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News