వీరమల్లు విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్!
వీరమల్లు విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్!పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా విడుదల గందరగోళంలో పడింది. మార్చి 28న విడుదలవుతుందని ప్రచారం జరిగినా, షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, పవన్ రాజకీయ షెడ్యూల్ వల్ల ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి టీజర్, రెండు పాటలు మాత్రమే వచ్చాయి. ట్రైలర్ విడుదలపై స్పష్టత లేకపోవడంతో ప్రచారపరంగా వెనుకబడి ఉన్నట్లు అనిపిస్తోంది. మరోవైపు మార్చి 28, 29న రాబోతున్న నితిన్ 'రాబిన్ హుడ్', సితార సంస్థ 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలు ప్రచారంలో దూకుడు చూపిస్తున్నాయి.
ఏదిఏమైనా నిర్మాత ఎ.ఎం. రత్నం నుంచి ఇప్పటివరకు 'హరిహర వీరమల్లు' వాయిదా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పవర్ స్టార్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా? లేక అనుకున్న సమయానికే వచ్చేస్తోందా? అనే దానిపై మరో వారంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.