సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా తెలుగులో సూర్య ‘రెట్రో’!

Update: 2025-02-27 17:19 GMT

సూర్య నటిస్తున్న ‘రెట్రో’ చిత్రం మే 1న తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేయబోతుంది.

కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, జోజు జార్జ్, జయరాం, నాజర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ అందిస్తున్న సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుంది.

సూర్య & జ్యోతిక నిర్మాణ సంస్థ 2D ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో భారీ స్థాయిలో థియేట్రికల్ రిలీజ్ చేస్తుంది. సితార సంస్థకు గతంలో 'దేవర, లియో, బ్రహ్మాయుగం' వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అనుభవం ఉంది. ఒకవైపు వరుస సినిమాలను నిర్మిస్తూనే, పంపిణీ రంగంలోనూ దూసుకెళ్తుంది సితార.

Tags:    

Similar News