‘8 వసంతాలు’ సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్!
ఒకవైపు అగ్ర కథానాయకులతో భారీ బడ్జెట్ లో భారీ సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ పైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈకోవలోనే మైత్రీ నుంచి వస్తోన్న సినిమా '8 వసంతాలు'. 'మధురమ్, మను' మూవీస్ ఫేమ్ ఫణీంద్ర నార్సెట్టి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 'మ్యాడ్' ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ఇతర కీలక పాత్రలను రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్న పసునూరి పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి స్పందన రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా రిలీజైన సాంగ్ కి సూపర్బ్ రెస్పాన్స్ దక్కుతుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి ఆలపించిన ‘అందమా అందమా…’ అంటూ సాగే గీతాన్ని వనమాలి రచించారు. అనంతిక, రవితేజ దుగ్గిరాల మధ్య చిత్రీకరించిన ఈ పాట మెలోడియస్ గా ఆకట్టుకుంటుంది. త్వరలోనే ‘8 వసంతాలు‘ ప్రేక్షకుల ముందుకు రానుంది