సుక్కూ అమెరికాలో స్క్రిప్ట్ మొదలు పెట్టాడట !
సుకుమార్ తన టీమ్‌తో కలిసి అమెరికాలో స్టోరీ రాయడం స్టార్ట్ చేశాడట. స్క్రిప్ట్ డిస్కషన్స్, స్టోరీ ప్లానింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆర్సీ17 అనౌన్స్‌మెంట్ తర్వాత నుంచి ఓ బిగ్ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. 2018లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘రంగస్థలం’ తర్వాత.. రామ్ చరణ్‌తో సుకుమార్ రెండోసారి జత కడుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్‌గా కొన్ని అప్‌డేట్స్ వచ్చాయి. సుకుమార్ తన టీమ్‌తో కలిసి అమెరికాలో స్టోరీ రాయడం స్టార్ట్ చేశాడట. స్క్రిప్ట్ డిస్కషన్స్, స్టోరీ ప్లానింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.
ఇది చూస్తుంటే.. ప్రాజెక్ట్ ఊపందుకుందని అర్థమవుతోంది. ఈ సినిమాని పాన్-ఇండియా రిలీజ్‌గా ప్లాన్ చేస్తున్నారు. 2025 చివర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్. రంగస్థలం లాంటి బిగ్ హిట్ ఇచ్చిన ఈ జోడీ నుంచి ఈ సినిమాలోనూ సాలిడ్ కంటెంట్, మాస్ అప్పీల్ ఉంటాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
చరణ్ 39 వ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సాంప్రదాయ లుక్‌లో ఉన్న చరణ్ ఫోటో హైప్‌ని మళ్లీ పీక్స్‌కి తీసుకెళ్లింది. ఇప్పుడు ఫ్యాన్స్ మరిన్ని అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. బహుశా టీజర్ లేదా షూటింగ్ షెడ్యూల్ వంటివి మేకర్స్ రివీల్ చేస్తారని భావిస్తున్నారు. ఈ ఎగ్జైట్‌మెంట్ చల్లారకుండా ఉండాలని కోరుకుంటున్నారు.