సుబ్రహ్మణ్యం రీ-యూనియన్!
By : Surendra Nalamati
Update: 2025-03-15 14:07 GMT
నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం‘. నాగ్ అశ్విన్ డెబ్యూ మూవీగా స్వప్న సినిమాస్ పై ఈ చిత్రం తెరకెక్కింది. 2015, మార్చి 21న విడుదలైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం‘ చిత్రానికి ఓ సందేశాత్మక చిత్రంగా మంచి రివ్యూస్ లభించాయి.
ఈ సినిమా నాని కెరీర్ లో ఓ గుర్తుండిపోయే చిత్రంగా నిలిస్తే.. విజయ్ దేవరకొండకి నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది. అలాంటి ‘ఎవడే సుబ్రహ్మాణ్యం‘ పదేళ్ల తర్వాత ఈ మార్చి 21న మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటైన రీ యూనియన్ లో చిత్రబృందం అంతా పాల్గొన్నారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం‘ మేకింగ్ కబుర్లను ముచ్చటించుకున్నారు. ఆ వీడియోని రిలీజ్ చేసింది టీమ్.