రెమ్యూనరేషన్ బాగానే పెంచేశాడట !
ప్రస్తుతం అతడు కన్సిస్టెంట్ గా హిట్స్ కొడుతూ .. నిర్మాతలకు నమ్మకం కల్పిస్తు్న్నాడు కాబట్టి, నిర్మాతలు కూడా అతడు అడిగినంత చెల్లించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు.;
శ్రీ విష్ణు తన తాజా చిత్రం ‘సింగిల్’ తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాడు. ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా.. ఊహించని విధంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సినిమా విజయం శ్రీ విష్ణు కెరీర్‌కు కొత్త ఊపిరి పోసింది. అతన్ని మరోసారి స్పాట్‌లైట్‌లో నిలబెట్టింది. తాజా సమాచారం ప్రకారం, ఈ విజయం తర్వాత శ్రీ విష్ణు తన రాబోయే చిత్రాల కోసం తన రెమ్యూనరేషన్‌ను భారీగానే పెంచేశాడని టాక్.
ప్రస్తుతం అతడు కన్సిస్టెంట్ గా హిట్స్ కొడుతూ .. నిర్మాతలకు నమ్మకం కల్పిస్తు్న్నాడు కాబట్టి, నిర్మాతలు కూడా అతడు అడిగినంత చెల్లించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ‘సింగిల్’ లో శ్రీ విష్ణు నటన అద్వితీయంగా ఉంది. ముఖ్యంగా, వెన్నెల కిషోర్‌తో కలిసి అతను పండించిన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ కామెడీ ట్రాక్‌లు సినిమాకు బలమైన ఆకర్షణగా నిలిచాయి, ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా మారింది.
శ్రీ విష్ణు ఎప్పటిలాగే తన సహజమైన నటన, ఆకట్టుకునే డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఈ సినిమా విజయం అతని వైవిధ్యమైన నటనా సామర్థ్యానికి మరో నిదర్శనంగా నిలిచింది. గతంలో కూడా అతను విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు, కానీ ‘సింగిల్’ తో అతను మరో మెట్టు ఎక్కాడని చెప్పవచ్చు.
రాబోయే రోజుల్లో శ్రీ విష్ణు లైనప్‌లో ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలలో అతను ఎలాంటి పాత్రలను ఎంచుకుంటాడు, తన కెరీర్‌ను ఎలా మలుచుకుంటాడు అనేది ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే తన నటనతో, ప్రత్యేకమైన సినిమా ఎంపికలతో ఒక విభిన్నమైన స్థానాన్ని సృష్టించుకున్న శ్రీ విష్ణు, ఈ విజయంతో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాడనడంలో సందేహం లేదు.