ఈ కన్నడ బ్యూటీ పంట పండింది !

‘హిట్ 3’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో శ్రీనిధి శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ విజయంతో ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆఫర్ల వర్షం కురుస్తోంది.;

By :  K R K
Update: 2025-06-01 05:08 GMT

నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్ 3’ థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలోనూ సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతోంది. స్టైలిష్ డైరెక్టర్ శైలేష్ కొలను రూపొందించిన ఈ సినిమా థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది. ఈ మూవీతో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. ‘హిట్ 3’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో శ్రీనిధి శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ విజయంతో ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆఫర్ల వర్షం కురుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, శ్రీనిధి శెట్టి ఇప్పటికే రెండు కొత్త తెలుగు సినిమా ప్రాజెక్ట్‌లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ల వివరాలను ఆమె త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలు ఆమె కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. శ్రీనిధి శెట్టి గతంలో ‘కేజీఎఫ్’ సిరీస్‌తో భారతీయ సినిమా ప్రేక్షకులకు సుపరిచితమైంది. అందులో ఆమె నటన, అందం అందరి దృష్టిని ఆకర్షించాయి.

ఇప్పుడు తన తొలి తెలుగు చిత్రం ‘హిట్ 3’ తో కూడా ఆమె అదే స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా, ఆమెను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఆశాజనకమైన నటిగా నిలబెట్టింది.

Tags:    

Similar News