ఫ్లాపులు వస్తున్నా ఆఫర్స్ ఆగడం లేదు !

ఈ ఏడాది శ్రీలీలకు తొలి పరాజయం "రాబిన్‌హుడ్" రూపంలో ఎదురైంది. నితిన్‌ తో కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. అయినప్పటికీ, ఆమెకు ఆఫర్లు మాత్రం వరుసగా వస్తున్నాయి.;

By :  K R K
Update: 2025-04-10 09:35 GMT

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల కెరీర్ గ్రాఫ్ ఆగకుండా ఎదుగుతూనే ఉంది. కొన్ని ఫ్లాపులు ఎదురైనా, ఆమె డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాది "పుష్ప 2"లో ఐటెం గర్ల్‌గా చేసిన పాత్ర ఆమెకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది, ముఖ్యంగా నార్త్ లో ఆమెకు పెద్దస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఈ ఏడాది శ్రీలీలకు తొలి పరాజయం "రాబిన్‌హుడ్" రూపంలో ఎదురైంది. నితిన్‌ తో కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. అయినప్పటికీ, ఆమెకు ఆఫర్లు మాత్రం వరుసగా వస్తున్నాయి.

ఇటీవల ఆమె అఖిల్ అక్కినేని నటిస్తున్న ఆరో చిత్రం "లెనిన్" కు సైన్ చేసింది. ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా శ్రీలీల నటించనున్నారని తెలిపే వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అలాగే నాగచైతన్యతో కూడిన ఓ ప్రాజెక్ట్ కోసం కూడా ఆమె చర్చలు జరుపుతోందని టాక్. ఇక బాలీవుడ్‌లో కూడా శ్రీలీల తొలి అడుగు వేయనుంది. కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఓ భారీ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది. దీనితో పాటు, రెండు తెలుగు చిత్రాల విషయమై చర్చలు కొనసాగుతున్నాయి.

శ్రీలీల సినిమాల ఫలితాలు కొంతవరకూ మిశ్రమంగానే ఉన్నా.. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీ పాపులారిటీ, యూత్‌లో ఆమె క్రేజ్ చూస్తే.. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్, బాలీవుడ్ రెండింటినీ టార్గెట్ చేస్తూ కెరీర్‌ను బలంగా ముందుకు తీసుకెళ్తోంది.

Tags:    

Similar News