హృతిక్ కి మిన్నగా తారక్!
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు పెరిగింది. ఆ తర్వాత 'దేవర'తోనూ మరో భారీ విజయాన్నందుకున్నాడు. ఇక లేటెస్ట్ గా ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.;
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు పెరిగింది. ఆ తర్వాత 'దేవర'తోనూ మరో భారీ విజయాన్నందుకున్నాడు. ఇక లేటెస్ట్ గా ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మరో కథానాయకుడిగా నటించాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు.
జులై 25న విడుదలైన ట్రైలర్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య భారీ కాన్‌ఫ్లిక్ట్‌ను హైలైట్ చేశారు. ఎన్టీఆర్ పాత్రకు నెగటివ్ షేడ్ ఉండొచ్చన్న టాక్‌తో ఆసక్తి రెట్టింపైంది. హృతిక్ మరోసారి రా ఏజెంట్ కబీర్ ధాలివాల్‌గా కనిపించనున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ కాగా.. ఈ సినిమాలో అలియా భట్ అతిథి పాత్రలో కనిపించనుందనే ప్రచారం జోరందుకుంది.
మరోవైపు ఈ సినిమాలో రెమ్యునరేషన్ పరంగా ఎన్టీఆర్ హై డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చిత్రం కోసం తారక్ రూ.60 కోట్లు పుచ్చుకుంటున్నాడట. హృతిక్ రోషన్ రూ.48 కోట్లు, కియారా అద్వానీ రూ.15 కోట్లు, దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ.32 కోట్లు పారితోషికంగా తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది.
ఈ లెక్కన చూస్తే ఎన్టీఆర్ ఈ చిత్రంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా నిలవబోతున్నాడు. బాలీవుడ్‌లో తొలిసారిగా నటిస్తున్నా కూడా ఈ స్థాయి రెమ్యునరేషన్ అందుకోవడం తారక్ పాన్ ఇండియా క్రేజ్‌కు నిదర్శనం. ‘వార్ 2’ ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.