అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా అల్లు- అట్లీ కాంబో!
ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ అంచనా రూ. 750 నుంచి రూ. 800 కోట్ల వరకు ఉంటుంది, ఇది భారతీయ సినిమాల్లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళ క్రేజీ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నాడు. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్స్ట్ లో ఒకటిగా నిలవనుందని తాజా సమాచారం. ఈ భారీ బడ్జెట్ చిత్రం దేశంలోని టాప్ టాలెంట్‌ను ఒకచోట చేర్చుతోంది. ఈ హై యాక్టెన్ యాక్షన్ సినిమా 2027లో సోలో రిలీజ్ కానుంది.
ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ అంచనా రూ. 750 నుంచి రూ. 800 కోట్ల వరకు ఉంటుంది, ఇది భారతీయ సినిమాల్లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. అల్లు అర్జున్‌కు రూ. 150 నుంచి రూ. 160 కోట్ల పారితోషికంతో పాటు, బ్యాక్-ఎండ్ డీల్స్ ద్వారా మరో రూ. 22 నుంచి రూ. 25 కోట్లు అందనున్నాయి. దర్శకుడు అట్లీకి ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 100 కోట్లు చెల్లించనున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు, సుమారు రూ. 240 నుంచి రూ. 250 కోట్ల బడ్జెట్‌తో ప్రపంచ స్థాయి విజువల్స్‌ను సృష్టించనున్నారు. నిర్మాణ ఖర్చు రూ. 200 కోట్లుగా ఉండగా, ప్రమోషన్స్, లాజిస్టిక్స్, ట్రావెల్ వంటి ఇతర ఖర్చులకు రూ. 100 కోట్లు కేటాయించారు.
టాప్ నటీమణులు దీపికా పదుకొణె, మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌లుగా ఖరారయ్యారు. రష్మికా మందన్న కూడా తారాగణంలో చేరేందుకు చర్చలు జరుపుతోంది. అంతర్జాతీయ షూటింగ్ షెడ్యూల్స్, విదేశీ విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్ టీమ్‌లతో కలిసి పనిచేయడం వల్ల ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్, గ్లోబల్ లాజిస్టిక్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి.ఈ చిత్రం భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయిలో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పే గ్రాండ్ సినిమాటిక్ ఈవెంట్‌గా రూపొందనుంది. అయితే, ఈ భారీ పెట్టుబడిని తిరిగి రాబట్టడమే ఇక్కడ అసలు సవాల్.