రష్మిక ‘మైసా‘ ప్రారంభం
నేషనల్ క్రష్ రష్మిక కొత్త సినిమా ‘మైసా‘ ప్రారంభమయ్యింది. హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు.;
By : S D R
Update: 2025-07-27 10:41 GMT
నేషనల్ క్రష్ రష్మిక కొత్త సినిమా ‘మైసా‘ ప్రారంభమయ్యింది. హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. అన్ ఫార్ములా ఫిలింస్ బ్యానర్ పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోండు హక్కులను కాపాడే యోధురాలిగా రష్మిక కనిపించబోతుంది.
ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో రష్మిక సంప్రదాయ చీరకట్టుతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు క్లాప్ కొట్టగా, డైరెక్టర్ హను రాఘవపూడి స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందించారు. తెలుగు, తమిళ, హిందీ సహా ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ‘మైసా‘తో పాటు రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్, థామా‘ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉంది.